Modi Three Nation Tour: మూడు దేశాల పర్యటన.. బయల్దేరిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:46 AM
ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవటంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్డాన్‌లోని హషెమెట్ కింగ్‌డమ్ వెళతారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సోమవారం) మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. వెస్ట్ ఆసియా, ఆఫ్రికాలలో కీలక భాగస్వామ్యులైన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవటంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్డాన్‌లోని హషెమెట్ కింగ్‌డమ్ వెళతారు. అమన్ పర్యటనలో భాగంగా కింగ్ అబ్దుల్లా 2 ఐబిన్ అల్ హుస్సేన్, ప్రధాన మంత్రి జఫార్ హాసన్, యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా 2తో సమావేశం కానున్నారు. జోర్డాన్‌లోని భారత కమ్యూనిటీని ఆయన కలవనున్నారు. జోర్డాన్ పర్యటన ముగిసిన తర్వాత ఇథియోపియా వెళతారు.
ప్రధాన మంత్రి అబి అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇథియోపియాకు వెళుతున్నారు. ప్రధాని మోదీ ఫెడరల్ డెమోక్రటిక రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపికాకు వెళ్లటం ఇదే మొదటి సారి. ఆడిస్ అబాబలో ప్రధాని మోదీ, అబి అహ్మద్‌లు సమావేశం కానున్నారు. అక్కడి భారతీయులను కలిసి ముచ్చటించనున్నారు. ఇథియోపియా పార్లమెంట్ ఉభయ సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఇండియా, ఇథియోపియా అనుబంధం గురించి మాట్లాడనున్నారు. చివరగా ఒమన్ దేశంలో ఆయన పర్యటిస్తారు. మస్కట్‌లో ప్రధాని మోదీ ఒమన్ సుల్తాన్‌తో చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చటం.. కమర్షియల్, ఎకనామిక్ కోఆపరేషన్‌ను విస్తృతం చేయటం గురించి చర్చించుకోనున్నారు. తర్వాత ఒమన్‌లోని భారతీయులతో ప్రధాని మోదీ మాట్లాడతారు.
మోదీ పర్యటనకు బ్రేక్..
ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరడానికి ముందు అనుకోని విధంగా స్వల్పంగా బ్రేక్ పడింది. ఈ ఉదయం 8.30 గంటల ప్రాంతంలోనే ఆయన మూడు దేశాల పర్యటను బయలు దేరాల్సి ఉండింది. అయితే, ఢిల్లీలో పొగమంచు ఎక్కువగా ఉంటంతో మోదీ పర్యటనకు బ్రేక్ పడింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానశ్రమంలో పొగమంచు కారణంగా తక్కువ విజబిలిటీ సమస్య ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ విమానం అక్కడినుంచి బయలు దేరడానికి అంతరాయం ఏర్పడింది. గంట తర్వాత ఆయన జోర్డాన్ బయలు దేరినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
8వ వేతన సంఘం ఎఫెక్ట్.. పెరిగిన జీతాలు చేతికొచ్చేదెప్పుడో?
నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్