Home » YSRCP
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందని ధ్వజమెత్తారు.
ఉరవకొండ మండలం రేణుమాకులపల్లెలో వైసీపీ సైకో మూకలు వీరంగం సృష్టించాయి. టీడీపీ కార్యకర్తల కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగపడ్డాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
జగన్.. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా..? కాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి నిలదీశారు.....
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. వైసీపీ అధికారానికే కాదు.. ప్రతిపక్షా హోదాకి సైతం దూరమైంది.
మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.
కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు మినహా.. రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పది శాతం వాటా ఉందని ప్రస్తావించారు.