Gudivada Amarnath On Jagan Visit: జగన్ పర్యటనకు నిబంధనలు.. పున: సమీక్షించాలన్న మాజీ మంత్రి
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:55 PM
జగన్ పర్యటనకు అనుమతి ఇస్తూనే 18 కండిషన్లు పెట్టారన్నారు. పోలీసులు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసం కాదని... పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నామని మాజీ మంత్రి తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబర్ 8: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former Minister Gudivada Amarnath) పర్యటనకు సంబంధించిన పోలీసులు ఇచ్చిన కొత్త రూట్‌ను తాము అంగీకరిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనకు అనుమతి ఇస్తూనే 18 కండిషన్లు పెట్టారన్నారు. పోలీసులు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసం కాదని... పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నామని మాజీ మంత్రి తెలిపారు. రేపు (గురువారం) జగన్ పర్యటన ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, అనకాపల్లి మీదగా ప్రయాణిస్తారని... నర్సీపట్నం మెడికల్ కళాశాలకు వెళ్తారని వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ బాధను చెప్పుకోవడానికి ఎయిర్ పోర్టుకు కానీ మార్గం మధ్యలో ఎక్కడికైనా రావాల్సిందిగా కోరుతున్నామన్నారు. పోలీసుల రూట్ మార్చినంత మాత్రాన వైసీపీ తన మాటను మార్చదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని.. తమ స్టాండ్ మారలేదని గుడివాడ అమర్‌నాథ్ తేల్చిచెప్పారు.
ప్రజా ఉద్యమంలో భాగంగానే: రజనీ
ప్రజా ఉద్యమంలో భాగంగానే రేపు నర్సీపట్నం మెడికల్ కళాశాలకు జగన్ వస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలన్నది జగన్ ఆలోచన అని అందుకే 17 కళాశాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో 5 కళాశాలలను ఆల్రెడీ ప్రారంభించామన్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి 2023 సంవత్సంలో జీఓ నెంబర్ 39 ఇచ్చామని గుర్తుచేశారు.ఈ మెడికల్ కాలేజీని 500 కోట్లతో నిర్మించనున్నామని జీవో ఇచ్చాం.. ఈ జోవోను చూసి అయినా కూటమి నేతలు మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. నర్సీపట్నంలో ల్యాండ్ లేదని, కాలేజీ లేదని, పర్మిషన్లు లేవని అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇలా మాట్లాడిన నేతలు అంతా జగన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. వస్తే వివరాలు అందిస్తామని.. కాలేజీ నిర్మాణం ఎంత వరకు వచ్చిందో కూడా చూపిస్తామని మాజీ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
జగన్ రోడ్ షోకు అనుమతి.. షరతులు వర్తిస్తాయ్
హద్దు మీరితే తోక కట్ చేస్తాం.. వైసీపీకి గంటా వార్నింగ్
Read Latess AP News And Telugu News