Tirupati News: అవును.. వీళ్లు బతికే ఉన్నారు...
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:18 PM
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్‌పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
తిరుపతి: మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి(Tirupati) రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్‌పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మొన్న ఆరుగురు. నిన్న ఐదుగురు. ఈరోజు రాత్రికి నలుగురు మిగిలారు. వెళ్లిపోయారో, చచ్చిపోయారో తెలీదు.
దూసుకుపోయే వాహనాలు.. నడచిపోయే మనుషులు.. ఎవరికీ పట్టని ఈ ప్రాణమున్న శవాలకు మంగళవారం సందెచీకటి వాలేవేళ మందుపూస్తూ, అన్నం పెడుతూ, నీళ్లు తాగిస్తూ అలిపిరి(Alipiri) అమ్మగా పేరుపడ్డ సుజాత కనిపించారు. ఈరోజు కన్నుమూసిన వ్యక్తికి పూలమాలవేసి, దణ్ణం పెట్టుకుని ఆమె సాగనంపారు.

దివ్యక్షేత్రమైన తిరుమల(Tirumala)కు తొలిమెట్టు అయిన అలిపిరిలో ఇది సాధారణ దృశ్యం. పవిత్ర భావనతో శ్రీనివాసుడి దగ్గరకు పయనమయ్యేవారి మనసు వికలమయ్యే చిత్రం. దేవుడిమీద భారం వేసి అలిపిరికి చేరుకుని ఇలా కన్నుమూస్తున్నవారికి జానెడు నీడ, పిడికెడు ముద్ద, రోగానికి మందు ఇచ్చే విశాల హుృదయం టీటీడీ(TTD)కి కలిగితే బావుణ్ణు!
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa