Jagan Roadshow: జగన్ రోడ్ షోకు అనుమతి.. షరతులు వర్తిస్తాయ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:01 AM
రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టం చేశారు.
విశాఖపట్నం, అక్టోబర్ 8: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) రోడ్ షోకు అనుమతి లభించింది. జగన్‌కు రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా, మాకవరపాలెంకి అనుమతి ఇచ్చారు పోలీసులు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.
జగన్‌మోహన్ రెడ్డి వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేయడం, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా గాయం, ప్రాణ నష్టం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Read Latess AP News And Telugu News