Home » YS Jagan Mohan Reddy
ఏపీలో దొంగచాటుగా దొంగ మద్యం అమ్మించిన వైసీపీ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. దొంగ మద్యంలో కేసులో వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒక పేరు బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.
అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలు వండి వార్చిన జగన్ మీడియా సంస్థ సాక్షి.
దాయాదుల మద్యం వ్యాపారంలో కల్తీ జరుగుతోందని సౌత్ ఆఫ్రికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనేది నిజం కాదా అని వర్ల రామయ్య అన్నారు. వైసీపీ కోవర్ట్ జయచంద్రా రెడ్డి.. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి క్యాంప్‌లో తలదాచుకున్నారనేది నిజం కాదా అని మరో ప్రశ్న సంధించారు.
జగన్ ఏపీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని తెలుగుదేశం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి జగన్ వచ్చి మాట్లాడవచ్చు కదా అని హితవు పలికారు.
ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని యామిని శర్మ మండిపడ్డారు.
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే.. అడ్డుకోవాలని జగన్ అండ్ కో చూస్తున్నారని అనకాపల్లి ఎంపీ రమేశ్ ధ్వజమెత్తారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలకు మెయిల్ పంపించి జగన్ అండ్ కో బెదిరిస్తున్నారని ఎంపీ రమేశ్ ఆరోపించారు
మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్ అని నక్కా ఆనంద్ బాబు అన్నారు. కరోనా సమయంలో వేలాది మందిని చంపేశారని మండిపడ్డారు. మాస్కులు అడిగితే పిచ్చొడని చెప్పి డా.సుధాకర్‌ను చంపేశారన్నారు.
రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు, దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు.