Home » YS Jagan Mohan Reddy
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అర్జున్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీలను ఎవరికీ దారాదత్తం చెయ్యడం లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వైసీపీ చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.
ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంలో జేపీ వెంచర్స్ ఐఏ దాఖలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంలో జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది.