Home » YS Jagan Mohan Reddy
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. తిరుమలలోమత విశ్వాసాల గౌరవించి సంతకం పెట్టమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదని నిలదీశారు. టీటీడీపైన బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని లేపడానికి, పొన్నూరును ముంచేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయని విమర్శించారు.
ఐదేళ్లు దేవుళ్లని కూడా దోచుకున్నందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు పక్కన పెట్టారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన హిందూ దేవాలయాలు, ఆచారాలను కూటమి ప్రభుత్వం పరిరక్షించి ప్రాధాన్యం కల్పిస్తోందనే కడుపుమంటతో జగన్ విష ప్రచారానికి దిగారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సిట్ అధికారులు నిందితులకు నిద్రలేకుండా చేస్తున్నారు. సిట్ దూకుడుతో కేసు జెట్ స్పీడ్‌లో ముందుకెళ్తుంది. తాజాగా కేసులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆయనను విచారించి నిజానిజాలు రాబట్టానున్నట్లు అధికారులు తెలిపారు.
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళిపై చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయని అంబటి మురళి అసత్య ప్రచారం చేశారని అప్పాపురం కాలువ ఏఈఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చేబ్రోలు పీఎస్‌లో కేసు నమోదైంది.
ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది నిజం కాదా అని కొలికపూడి ప్రశ్నించారు.
వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతి మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని.. కారణాలు తెలియకుండా మాట్లాడవద్దని మంత్రి నారాయణ హితవు పలికారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2 పథకాలతో పాటు విద్య పథకాల ద్వారా కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణే జగన్ అసహనానికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇలాంటి సంక్షమ పథకాలను చూసి జగన్ అండ్ కో ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. మహిళల ఖాతాల్లో డబ్బులు పడుతుండటాన్ని తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.