Home » YCP
జగన్ మానసిక రుగ్మత(సైకిక్ డిజార్డర్)తో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన వారినల్లా లేపేస్తే ఇక అడిగే వారే ఉండరన్నది ఆయన ఉద్దేశంగా ఉందన్నారు.
బీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బెదిరించాలనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. రాధాకృష్ణను బెదిరించడం మీ తండ్రి(వైఎస్) వల్లే కాలేదు....
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కథనంపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై దాడిలో 19 మంది వైసీపీ నేతలపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. దారిలో పెడుతున్నామని వెల్లడించారు.
గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బందిని బెదిరింపులకు గురి చేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసేందుకు కాకాణి, వైసీపీ శ్రేణులు యత్నించారు.
మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్‌పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొంతమంది రౌడీలతో రౌడీయిజం చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన పత్రికా వ్యవస్థపై దాడిగా భావించాలన్నారు.
ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెసింగ్ చేసేలా సరికొత్తగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రాం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో రూ.528.65 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.