Share News

Jagan Faces Coconut Ritual: జగన్‌కు టెంకాయతో తంటా

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:51 AM

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు మరోసారి కొబ్బరికాయ పరీక్ష ఎదురైంది. ఆయన సీఎంగా ఉండగా...

Jagan Faces Coconut Ritual: జగన్‌కు టెంకాయతో తంటా

  • అప్పుడు నిలబడి... ఇప్పుడు కూర్చోని..

  • కొబ్బరికాయ కొట్టలేక అవస్థలు

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు మరోసారి ‘కొబ్బరికాయ’ పరీక్ష ఎదురైంది. ఆయన సీఎంగా ఉండగా... ఉగాది పర్వదినంరోజున తాడేపల్లి ప్యాలె్‌సలో ఏర్పాటు చేసిన వేంకటేశ్వరస్వామి విగ్రహం ముందు పురోహితుడు రాయిపట్టుకుని నిలబడగా... జగన్‌ కూడా నిలబడే కొబ్బరికాయ కొట్టారు. దీనికోసం ఆయన నానా కష్టాలు పడ్డారు. ఇక... బుధవారం వినాయకచవితి రోజు తాడేపల్లి ప్యాలె్‌సను ఆనుకుని ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమ వద్ద జగన్‌ పూజలు చేశారు. పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్లు, దేవినేని అవినాశ్‌ పక్కన కూర్చొని.. ఆయన కొబ్బరి కాయను కొట్టేందుకు ప్రయత్నించారు. అది పూర్తిగా పగల్లేదు. దీంతో పక్కనే ఉన్న వెలంపల్లి కొబ్బరికాయను జగన్‌ చేతి నుంచి తీసుకుని.. పగలగొట్టే ప్రక్రియ పూర్తి చేశారు. ఇక... విజయవాడ రాణిగారితోటలో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపంలో పూజలు చేయాలని జగన్‌ భావించారు. కానీ... వర్షం కురుస్తుండటంతో అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు.

భారతితో కలిసి చెన్నైకి జగన్‌

చెన్నై, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ గురువారం చెన్నై వచ్చారు. వ్యక్తిగత పనులపై బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలసి వచ్చిన జగన్‌కు విమానాశ్రయం వద్ద వైఎస్‌ఆర్‌ సేవాదళం కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ‘ఇండియా సిమెంట్స్‌’ చైర్మన్‌ శ్రీనివాసన్‌ నివాసానికి వెళ్లారు. అక్కడినుంచి ఇంజంబాక్కంలో తన సమీప బంధువు వైఎస్‌ అనిల్‌రెడ్డి నివాసానికి వెళ్లిన జగన్‌.. సాయంత్రం సునీల్‌రెడ్డి పెద్ద కుమారుడు సాహుల్‌కు, మురుగప్పా గ్రూపు చైర్మన్‌ మనవరాలికి జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం బెంగళూరు వెళ్లనున్నారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 04:51 AM