CM Chandrababu comments on YCP: అదొక ఫేక్ పార్టీ.. ఆ మాట అన్నది అందుకే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:20 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఒక ఫేక్ పార్టీ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఒక ఫేక్ పార్టీ అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాలు, అనేక నాయకులు, ముఖ్యమంత్రులను చూశానని.. కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, నేరాలను నమ్మకున్న ఆ పార్టీ.. నిత్యం విషప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అందుకనే తాను వైసీపీని విషవృక్షం అని పిలుస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది పంట పొలాల్లో ఫెర్టిలైజర్ వినియోగాన్ని కాస్త తగ్గించి.. 33 లక్షల మెట్రిక్ టన్నులు వాడేలా చూస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుని.. అన్ని జిల్లాలో ఎరువులు అందిస్తొందన్నారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలను వెల్లడిస్తున్నామని తెలిపారు. 94892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. మార్క్ ఫెడ్‌కి సంబంధించి 81750 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది రైతులు యూరియాను అత్యధికంగా వాడారని, రెండు పంటలు వేయడంతో యూరియా వాడకం పెరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News