Home » YCP
వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మంత్రి నారాయణకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసులు లోతుగా విచారణ చేస్తూ కేసును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. అయినా జగన్ హయాం.. మహిళలకు స్వర్ణ యుగం అంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు..
2023 ఎన్‌సీఆర్‌బీ నివేదికే జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే నేరాలు, ఘోరాలు అత్యధికమన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, వైసీపీ మహిళా విభాగం తమ మద్దతును ప్రకటించింది. విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఈ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.
దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌గా జువ్వలదిన్నె అభివృద్ధి చెందబోతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టులకు పట్టిన గ్రహణం జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ఏ2 నిందితురాలిగా ఉన్నారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక రాయి అయినా వేశారా అని టీడీపీ నేత హనుమతరావు ప్రశ్నించారు. చంద్రబాబు సారథ్యంలో ఇప్పుడు అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నం ఘటనలో కాకాణి గోవర్ధన్ సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాయు వేగంతో అమరావతి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.