Share News

Mithun Reddy to Police Custody: పోలీస్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:52 PM

లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Mithun Reddy to Police Custody: పోలీస్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
Mithun Reddy to Police Custody

విజయవాడ: లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ మేరకు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మిథున్ రెడ్డిని పోలీసు కస్టడీలో విచారించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ (Special Investigation Team) ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ కోరింది.


Also Read:

చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్

హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం..

For More Latest News

Updated Date - Sep 18 , 2025 | 05:21 PM