Share News

Nara Lokesh On Fake Videos: ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 09:20 AM

వైసీపీ ఫేక్ వీడియోలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Nara Lokesh On Fake Videos: ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Nara Lokesh

అమరావతి: వైసీపీ తీరుపై విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేసినా.. ప్రతి క్షణమూ ఆ పార్టీ విషం కక్కుతూనే ఉందని ఫైర్ అయ్యారు.


యూరియా విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో.. ప్రతిదాంట్లో ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆందోళనలను వైసీపీ క్రిమినల్స్ చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు మాటలని... ఎడిట్ చేసి ముఖ్యమంత్రి రైతులను హెచ్చరించారు అనే విధంగా ఇంకో ఫేక్ వీడియోని క్రియేట్ చేశారని వివరించారు. ఒక ముఖ్యమంత్రి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే వైసీపీ విషసర్పాలు వక్రీకరించారని మండిపడ్డారు. ప్రజలంతా ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు.


Also Read:రూ.25 లక్షలు, 15 తులాల బంగారు ఆభరణాలతో.. ఏం జరిగిందంటే..

భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

For More Latest News

Updated Date - Sep 10 , 2025 | 09:24 AM