Share News

Hyderabad: రూ.25 లక్షలు, 15 తులాల బంగారు ఆభరణాలతో.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 10 , 2025 | 07:02 AM

డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన మహిళా వైద్యురాలిని వలలో వేసుకొన్న ఓ వ్యక్తి ఆమె నుంచి డబ్బు, నగలు తీసుకుని తన అవసరాలు తీరగానే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అల్వాల్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌ పరిధిలో నివసించే ఓ యువతి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రైవేట్‌గా క్లినిక్‌ పెట్టుకున్నారు.

Hyderabad: రూ.25 లక్షలు, 15 తులాల బంగారు ఆభరణాలతో.. ఏం జరిగిందంటే..

- డేటింగ్‌ యాప్‌లో వల.. వైద్యురాలికి టోకరా

హైదరాబాద్: డేటింగ్‌ యాప్‌(Dating app) ద్వారా పరిచయమైన మహిళా వైద్యురాలిని వలలో వేసుకొన్న ఓ వ్యక్తి ఆమె నుంచి డబ్బు, నగలు తీసుకుని తన అవసరాలు తీరగానే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అల్వాల్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌ పరిధిలో నివసించే ఓ యువతి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రైవేట్‌గా క్లినిక్‌ పెట్టుకున్నారు.


గత ఏడాది సోషల్‌ మీడియా(డేటింగ్‌యాప్‌) ద్వారా సంగారెడ్డి(Sangareddy) జిల్లా అమీన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం(32)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉందని నిందితుడు సదరు యువతిని నమ్మించి పలు దఫాలుగా రూ. 25లక్షలు తీసుకున్నాడు. ఆమె తల్లి కూడా నిందితుడి మాయమాటలను నమ్మి 15 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది.


city1.2.jpg

చివరికి పెళ్లి ప్రస్తావన తీసుకరాగానే సుబ్రహ్మణ్యం బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని వేధించేవాడు. ఆ తర్వాత ఫోన్‌లో సిమ్‌ను తీసి కొత్తనంబర్‌ వాడుతుండడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు మంగళవారం రాత్రి అల్వాల్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సీఎం రేవంత్‌ ఇంటి ప్రహరీ కూల్చివేత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 10 , 2025 | 07:02 AM