Share News

Trump Modi meeting: భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 10 , 2025 | 06:58 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సుంకాల పేరుతో భారత్‌పై తన ఆగ్రహాన్ని వెల్లిబుచ్చిన ట్రంప్ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది.

Trump Modi meeting: భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Trump Modi meeting

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సుంకాల పేరుతో భారత్‌పై తన ఆగ్రహాన్ని వెల్లిబుచ్చిన ట్రంప్ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. చైనా, రష్యాలతో భారత్ స్నేహం ట్రంప్‌ను, అమెరికా యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీంతో ట్రంప్ మాటల్లో మార్పు వస్తోంది. దీంతో ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు (Trump calls Modi good friend).


'అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి నా పరిపాలనా విభాగం చర్చలు జరుపుతోంది. ఈ అంశంపై నా మిత్రుడైన భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే నా మిత్రుడు మోదీకి ఫోన్‌ చేస్తా. ఇండియాతో ట్రేడ్‌ డీల్‌ గురించి మాట్లాడతా. ట్రేడ్‌ డీల్‌ విజయవంతమవుతుందని ఆశిస్తున్నా' అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భారత్ గురించి ట్రంప్ ఇంత సానుకూలంగా మాట్లాడడం ఇదే ప్రథమం. కొన్ని రోజులుగా ట్రంప్, అతడి కార్యవర్గం భారత్‌ను హెచ్చరించేందుకు ప్రయత్నించారు (US India relations 2025).


రష్యా నుంచి అధికంగా చమురు కొంటోందనే సాకు చూపి భారత్‌పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు (Modi Trump news). భారత దిగుమతులుపై ఏకంగా 50 శాతం పన్నులు విధించారు. దీంతో భారత ప్రధాని మోదీ షాంఘై సహకార సదస్సుకు హాజరై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీలపై ట్రంప్ స్పందిస్తూ.. చైనా చీకటి వలయంలోకి భారత్ వెళ్లిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొన్ని గంటల్లోనే మాట మార్చారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 07:21 AM