Mithun Reddy Custody: కస్టడీలో సిట్ అధికారులకు సహకరించని మిథున్ రెడ్డి
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:08 PM
మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ఏ-4 మిథున్ రెడ్డిని సిట్ విచారించింది. కస్టడీలో తొలి రోజునే సిట్ అధికారులు ఆయనను పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
విజయవాడ: మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ఏ-4 మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఇవాళ(శుక్రవారం) విచారించారు. కస్టడీలో తొలి రోజునే సిట్ అధికారులు ఆయనకు పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించారు. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలోకి వెళ్లడంపై ప్రశ్నించిన సిట్.. ఐదేళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల గురించీ సమాధానాలు రాబట్టే పయత్నం చేశారు. అయితే, ఈ ప్రశ్నకు ఎన్నికల అఫిడవిట్ లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్టు మిథున్ రెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.
ఫోన్ గురించి ఆరా తీసిన సిట్ అధికారులు.. మిథున్ రెడ్డి మొబైల్‌ను FSLకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంపెనీలకు డబ్బులు మళ్లింపుపై ప్రశ్నించగా.. తాను ఏ సంస్థలోనూ డైరెక్టర్‌గా లేనని మిథున్ రెడ్డి సిట్‌కు స్పష్టం చేశారని తెలుస్తోంది. అయితే, మరికొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని మిథున్ రెడ్డి వరస సమాధానాలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనేక ప్రశ్నలకు మిథున్ రెడ్డి సహకరించలేదని సిట్ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి
For More Latest News