Home » West Bengal
తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మెుత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తమిళనాడులో 84.8 శాతం, పశ్చిమ బెంగాల్‌లో తొలిదశలో 91.95 శాతం పోలింగ్ నమోదైంది.
ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్‌లలోనూ అక్రమాలు జరిగినట్లు ఈసీ గుర్తించింది. ఆ పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. మే 21వ తేదీన రీపోలింగ్ జరగనుంది. మే 24వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు ఈసీకి నివేదికలు సమర్పించారు. డైమండ్ హార్బర్ నుంచి 29 ఫిర్యాదులు.. మగ్రహట్ నుంచి 13 ఫిర్యాదులు ఈసీకి అందాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.
కోల్‌కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు మందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు.
భవానీపూర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సౌత్ కోల్‌కతాలోని స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లడం, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తలెత్తిన హైడ్రామాపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ టీఎంసీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.