Share News

రెండో విడత ఎన్నికల వేళ .. బెంగాల్‌లో 100 నాటుబాంబులు స్వాధీనం

ABN , Publish Date - Apr 26 , 2026 | 06:45 PM

పశ్చిమబెంగాల్‌లో కీలకమైన రెండో విడత పోలింగ్‌కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్‌లోని ఓ ఇంటి నుంచి సుమారు 100 నాటు బాంబులను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.

రెండో విడత ఎన్నికల వేళ .. బెంగాల్‌లో 100 నాటుబాంబులు స్వాధీనం
crude bombs recovered in West Bengal

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కీలకమైన రెండో విడత పోలింగ్‌కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని భాంగర్‌లోని ఓ ఇంటి నుంచి సుమారు 100 నాటు బాంబులను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రఫీకుల్ ఇస్లాం అనే కార్యకర్త ఇల్లుగా చెబుతున్నారు. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ గాలింపు చర్యలు చేపట్టి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 29న కీలకమైన తుదివిడత పోలింగ్ జరుగనుంది.


142 నియోజకవర్గాల్లో భారీ భద్రత

రెండో విడత పోలింగ్ జరుగనున్న 142 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్లాన్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటింగ్‌ను అడ్డుకోవడం, ఓటర్లకు అవాంతరం కలిగించేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నియోజకవర్గాలవారీగా మోహరించాలని భద్రతా సిబ్బందిని ఈసీ అదేశించింది. మూరుమాల నివాస ప్రాంతాల్లోని ఓటర్లు సైతం నిర్భయంగా ఓటు వేసేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సన్నాహకాలపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈసీ సమీక్షించింది. పోల్ అధికారులు, సీనియర్ పోలీసు అధికారులు, కేంద్ర బలగాల కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఈసీ భద్రతా ప్లాన్‌లో భాగంగా, ఒక్కో మోటారుసైకిల్‌పై ఇద్దరేసి సీఏపీఎఫ్ జవాన్లతో మొత్తం 160 మోటారు సైకిళ్లను పెట్రోలింగ్‌కు దింపుతున్నారు. 142 నియోజకవర్గాల్లోనూ ఈ పెట్రోలింగ్ జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా సివిల్, పోలీస్ యంత్రాంగం పూర్తి సమన్వయంతో వ్యహరించాలని ఈసీ ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ అహకారం మొదటి విడతలోనే ముక్కలైంది: మోదీ

ఫిరాయింపు ఎంపీలపై వేటు.. రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ వినతి పత్రం

Updated Date - Apr 26 , 2026 | 06:51 PM