Share News

కోల్‌కతాలో మోదీ భారీ రోడ్‌షో

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:01 PM

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్‌కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్‌షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రచారం సాగించారు.

కోల్‌కతాలో మోదీ భారీ రోడ్‌షో
PM Modi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్‌కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్‌షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రచారం సాగించారు. కోల్‌కతాలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్‌షోలో పెద్దఎత్తున కార్యకర్తలు బలప్రదర్శనగా ముందుకు సాగారు.


సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి దగ్గర నుంచి ఈ రోడ్‌షో మొదలైంది. స్వామి వివేకానంద విగ్రహానికి ప్రధాని పూలమాలలు వేసి రోడ్‌షో ప్రారంభించారు. ప్రఖ్యాత బిదాన్ సరానీ, హేదు పార్క్, బెత్యూన్ కాలేజ్ మీదుగా శ్యామ్‌బజార్‌లోని ఖన్నా క్రాసింగ్‌కు చేరుకోవడంతో రోడ్‌షో ముగిసింది.


సిద్ధేశ్వరి మాతకు పూజలు

దీనికిముందు, కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీ దేవాలయాల్లో ఒకటైన తంథానియా కాళీబారి మందిరాన్ని ప్రధాని దర్శించుకున్నారు. అక్కడి సిద్ధేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. 300 సంవత్సరాల పైగా చారిత్ర ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని రామకృష్ణ పరమహంస తరచు సందర్శించేవారని చెబుతారు. సిద్ధేశ్వరి మాతకు మాంసాహారం ప్రసాదంగా సమర్పిస్తారు. అమ్మకు ఈ ప్రసాదాన్ని రామకృష్ణ పరమహంస మొదటగా సమర్పించారని, అప్పట్నించి ఇదే ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలుస్తోంది. రామకృష్ణ పరమహంస ఒకసారి శ్యాంపుకూర్‌లో బస చేసినప్పుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తూ పరమహంస శిష్యులు మాంసాహార ప్రసాదాన్ని దేవికి సమర్పించినట్టు చెబుతారు.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ అహంకారం మొదటి విడతలోనే ముక్కలైంది: మోదీ

రెండో విడత ఎన్నికల వేళ .. బెంగాల్‌లో 100 నాటుబాంబులు స్వాధీనం

Updated Date - Apr 26 , 2026 | 08:31 PM