Share News

చొరబాటుదారులను ఏరివేస్తాం: అమిత్ షా

ABN , Publish Date - Apr 26 , 2026 | 06:37 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..

చొరబాటుదారులను ఏరివేస్తాం: అమిత్ షా
West Bengal Elections BJP Campaign

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, చొరబాటుదారులు, ఉగ్రవాద నిర్మూలనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనకడుగు వేయదని అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం. ఇప్పటికే ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను చిన్నాభిన్నం చేయడమే కాకుండా.. వారి ఆస్తులను, ఇళ్లను ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే శక్తులకు భారత గడ్డపై చోటు లేదని ఆయన హెచ్చరించారు.


ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘బెంగాల్ రాజకీయాల్లో మార్పు ఖాయం. మే 4వ తేదీన బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. బెంగాల్‌లో చొరబాటుదారులను వదిలేద్దామా? వారు మన వనరులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా?. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటుదారులను ఏరివేస్తాం. సరిహద్దు భద్రతను పటిష్టం చేయడంతో పాటు, బెంగాల్‌ను మళ్లీ 'సోనార్ బంగ్లా'గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ అని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బద్దలైన అగ్ని పర్వతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు..

ఎండా కాలంలో కూల్ టెక్నిక్.. ఇతడి తెలివికి సలాం కొట్టాల్సిందే..

Updated Date - Apr 26 , 2026 | 07:33 PM