Home » West Bengal
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్‌లో న్యాయస్థానానికి హాజరయ్యారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్‌లోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వల్ల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల తొలగింపులు చేపట్టిన ప్రాంతాల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓడిపోతే దానిపై తిరిగి దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ బాధితులకు ఉందని స్పష్టం చేసింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారంనాడు జరిపిన తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కోసం భూమిని బీఎస్ఎఫ్‌కు ఈరోజు నుంచే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
సువేందు అధికారి పీఏ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్' పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం మమత, ఆమె మేనల్లుడు అభిషేక్‌లపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారు. పార్టీ ఓటమి చవిచూడగానే అంతర్గత కుమ్ములాటలు ఒక్కొకటిగా బహిర్గతమవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు మాఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది.
టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మనసు మార్చుకున్నారు. తన ఎక్స్ ఖాతాలో బయోను మార్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసనసభ) అని రాసుకున్నారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది.
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రజలకు సాష్టాంగ వందనం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు.