Share News

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

ABN , Publish Date - May 06 , 2026 | 06:00 PM

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు
Kolkatas Brigade Parade Ground

కోల్‌కతా, మే 06: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే అంశంపై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరిని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతోంది. అయితే పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది.


మే 9వ తేదీ (శనివారం) ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య బుధవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఉదయం10 గంటలకు మహానగరంలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.


గురువారం సాయంత్రం కోల్‌కతాలో శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని సమీక్ భట్టాచార్య తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేతను పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఎన్నుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రం మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నాయకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.


ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరనున్న మంత్రి వర్గంలో దాదాపు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే దృష్టి కేంద్రీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మహ్మద్ నసీర్

కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ

For More National News And Telugu News

Updated Date - May 06 , 2026 | 06:16 PM