Share News

కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ

ABN , Publish Date - May 06 , 2026 | 05:02 PM

మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరితగతిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ వెల్లడించారు. ఈ పరిహారం చెల్లింపులో ఆలస్యం ఉండకూడదని తెలిపారు.

కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ
Rayapati Sailaja

విజయవాడ, మే 06: మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరితగతిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ వెల్లడించారు. ఈ పరిహారం చెల్లింపులో ఆలస్యం ఉండకూడదని తెలిపారు. బుధవారం రాజధాని అమరావతిలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ.. విభాగాల సమన్వయం పెంపొందించేందుకు ఆన్‌లైన్ మీటింగ్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


బాధితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రాక్టికల్ సమస్యల గురించి చర్చించామని చెప్పారు. అర్హత, నిర్ధారణ, నిధుల విడుదలలో అడ్డంకులు ఉన్నట్లు ఈ సందర్భంగా పలు సమస్యలను రాయపాటి శైలజ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని వారికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా కోటేశ్వరరావు సూచించారు.


బాధితుల పునరావాసంపై హెల్ప్ సంస్థ, ఇతర ప్రతినిధుల సూచనలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. పెండింగ్ కేసులు, బడ్జెట్ అవసరాలపై జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు శైలజ వెల్లడించారు. అన్ని విభాగాలు కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని మహిళా కమిషన్ చైర్మన్ శైలజ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్

ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.. డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు

For More AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 05:08 PM