Share News

భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు

ABN , Publish Date - May 06 , 2026 | 04:10 PM

తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ హైకోర్టులో టి. ధన్‌పాల్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన నియామకంపై ప్రభత్వం జారీ చేసిన జీవో నెం. 559పై స్టే విధించాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు
TG High Court

హైదరాబాద్, మే 06: తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ హైకోర్టులో టి. ధన్‌పాల్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన నియామకంపై ప్రభత్వం జారీ చేసిన జీవో నెం. 559పై స్టే విధించాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక డీజీపీ నియామకంపై గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు అనుబంధంగా కొత్త అప్లికేషన్‌ను పిటిషనర్ కోర్టులో దాఖలు చేశారు.


సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజీపీ నియామకం జరిగిందని తన పిటిషన్‌లో ధన్‌పాల్ రావు స్పష్టం చేశారు. యూపీఎస్సీ నుంచి అర్హుల జాబితా తీసుకోలేదని పిటిషన్‌లో ఆయన ఆరోపించారు. ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. డీజీపీగా నియామకం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చీఫ్ సెక్రటరీ ర్యాంకులో ఆయనను నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ

ప్రపంచస్థాయికి ఎక్కిన గొడ్డలి పార్టీ నేరాలు: టీడీపీ ఎమ్మెల్సీ

For More TG News And Telugu News

Updated Date - May 06 , 2026 | 04:17 PM