Home » Weather
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉత్తర ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే ఐదురోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని పైన ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది.
వాతావరణంలో ఏర్పడిన మార్పులతో రాగల మూడు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించారు.