Home » Weather
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వివరాలను అధికారులు తీసుకెళ్లారు.
భాగ్యనగర వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, మెహదీపట్నం, హిమాయత్‌నగర్, నారాయణగూడ, అంబర్‌పేటలో కుంభవర్షం పడుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
బంగాళాఖాతంలో ఈనెల 22న మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి వచ్చే తుఫాన్ అవశేషాల ఫలితంగా ఈనెల 20వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, థాయ్‌లాండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నేడు, రేపు (ఆదివారం) రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలిసారిగా అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి.