తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు..!!
ABN, Publish Date - Jun 14 , 2026 | 08:51 AM
తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు దంచికొడుతున్నాయి. 30 జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 621 మండలాలు ఉండగా 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్ మార్గంలో భారి వృక్ష నేలకూలగా ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిపై తాటి చెట్టు పడడంతో లక్ష్మీ సేవ్య అనే మహిళ మృతి చెందారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jun 14 , 2026 | 08:51 AM