Share News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు హీట్‌ వేవ్

ABN , Publish Date - Jun 11 , 2026 | 02:59 PM

తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఎండలు, హీట్‌వేవ్ ప్రభావం కొనసాగుతోంది.

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు హీట్‌ వేవ్
Telangana Weather

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఎండలు, హీట్‌వేవ్ ప్రభావం కొనసాగుతోంది. సాధారణంగా ఈ సమయానికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా విస్తరించాల్సి ఉండగా, ఈ ఏడాది వాటి పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. వర్షాలు చురుగ్గా ఉన్నప్పుడే పంటల సాగు చేపట్టాలని.. లేకపోతే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాగే గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో కూడా ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.


గ్రేటర్ హైదరాబాద్ వారికి ఈసారి నీటి కష్టాలు తప్పవని.. నీటి వినియోగంలో ఇప్పటి నుంచే పొదుపు చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. కురిసిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాదే కాకుండా.. వచ్చే సంవత్సరం కూడా కొనసాగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మిస్సింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 04:09 PM