కామారెడ్డిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మిస్సింగ్
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:32 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌లో తల్లితో పాటూ ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు.
కామారెడ్డి, జూన్ 11: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌లో తల్లితో పాటు ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లి లయ(31), కొడుకు శివ(13), ఇద్దరు కుమార్తెలు బిందు(16), దివిజ(08) ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం బయటకు వెళ్లిన నలుగురు ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్స్ వివరాలు పరిశీలిస్తున్నారు. నలుగురు ఒకేసారి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరి మిస్సింగ్‌కు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది.
గాంధీనగర్‌కు చెందిన లయ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాల సభ్యులు పంచాయితీ నిర్వహించి.. ఇరువురూ కలిసుండేలా ఒప్పించారు. ఇందులో భాగంగా భార్యాభర్తలు, పిల్లలతో కలిసి గాంధీనగర్‌లో ఉంటున్నారు. మళ్లీ గొడవలు మొదటికి రావడంతో మనస్థాపం చెందిన లయ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లయ తిరిగి రాకపోవడంతో.. భర్త, బంధువులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.. ఆరుగురి అరెస్ట్
కామారెడ్డి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్.. క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News