Home » Visakhapatnam
ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే వైసీపీకి తెలియదని ఆక్షేపించారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్డీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకూ ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దు అన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండీషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశాడు.
వైసీపీ నేతలు యువతకు డ్రగ్స్ సరఫరా చేసి.. రప్పా రప్పా రాజకీయాలు చేయాలని అనుకుంటారా అంటూ పట్టాభి ఫైర్ అయ్యారు. డ్రగ్స్పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.
ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుతం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విశాఖపట్నం ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన 20లక్షల ఉద్యోగాలని కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు మంత్రి డోలా.
విశాఖలోని ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలిలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.
విశాఖలోని సమతా డిగ్రీ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా లెక్చరర్ వేధించడంతోనే విద్యార్థి సాయితేజ మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.