Swami Srinivasananda: జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
ABN , Publish Date - Dec 17 , 2025 | 02:11 PM
హిందూ దేవాలయాలపై జగన్‌కు ఎందుకు ఇంత ద్వేషమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం, డిసెంబర్ 17: తిరుమల పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అని జగన్ వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి (Swami Srinivasananda Sarswati) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణి కేసును హైకోర్టు సీరియస్‌గా తీసుకుందన్నారు. హిందూ దేవాలయాలపై జగన్‌కు ఎందుకు ఇంత ద్వేషమని ప్రశ్నించారు. లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేయించినట్లు డ్రామా ఆడారని ఆరోపించారు. గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కనుసనల్లో ఈ వ్యవహారం జరిగిందని సంచలన కామెంట్స్ చేశారు.
ఒక సాధారణ ఉద్యోగి రూ.14.40 కోట్లు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఒక సాధారణ ఉద్యోగి రవికుమార్ 14.40 కోట్లు ఇచ్చారంటే అవినీతి ఎంత మొత్తంలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్‌కు హిందువులు ఓట్లు వేయలేదా అని అడిగారు. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చారని మండిపడ్డారు. తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలకు జగన్ ఏనాడు సతీసమేతంగా హాజరు కాలేదని తెలిపారు.
జగన్‌మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్‌పై ఏనాడు సంతకం పెట్టలేదని అన్నారు. జగన్‌కు హిందువులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టినా కూడా.. జగన్‌కు బుద్ధి రావడం లేదన్నారు. హిందూ మతంపై దాడి చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక సూచనలు
అవి ప్రభుత్వ కాలేజీలే.. మెడికల్ కళాశాలలపై సీఎం చంద్రబాబు స్పష్టత
Read Latest AP News And Telugu News