Home » Visakhapatnam
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.
విశాఖ కిమ్స్ ఆస్పత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి లోకేశ్ పరామర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పరామర్శించారు. షీలానగర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పరామర్శించి.. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందటంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు.
విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు.