Share News

Major Wedding Theft Case: జైల్లో పరిచయం.. విడుదలైన నెల రోజులకే పెళ్లి ఇంట్లో కన్నం..

ABN , Publish Date - Aug 21 , 2025 | 07:53 PM

Major Wedding Theft Case: భారీ దొంగతనం కేసును గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. షీలా నగర్ పెళ్లి ఇంటిలో దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందుతులు నాగేశ్వరరావు, అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, రాంబాబులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Major Wedding Theft Case: జైల్లో పరిచయం.. విడుదలైన నెల రోజులకే పెళ్లి ఇంట్లో కన్నం..
Major Wedding Theft Case

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న భారీ దొంగతనం కేసును గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. షీలా నగర్ పెళ్లి ఇంటిలో దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందుతులు నాగేశ్వరరావు, అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, రాంబాబులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు ఈ కేసును ఛేదించారు. దొంగలు పెళ్లి ఇంట్లో 100 తులాల బంగారం, 13.5 లక్షల నగదును దొంగతనం చేశారు.


పోలీసులు నిందితుల నుంచి 72 తులాల బంగారం, 9 లక్ష నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై విశాఖ క్రైమ్ డీసీపీ లతా మాధురి మాట్లాడుతూ.. ‘జైల్లో ఏర్పడిన పరిచయంతో ముగ్గురు నిందితులు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందుతులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. కేసులోని ఏ1,ఏ2 నిందితులు హైదరాబాద్‌లోని మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.


దొంగలించిన బంగారాన్ని ముత్తూట్‌లో తాకట్టు పెట్టారు. జైల్ నుంచి విడుదలైన నెల రోజుల వ్యవధిలో షిలానగర్‌లోని ఇంట్లో దొంగతనం చేశారు. ప్రజలు భద్రంగా ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

శ్రేయస్, జైస్వాల్ పాకిస్థాన్‌లో ఉండుంటే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

తాబేళ్ల రౌండ్ టేబుల్ సమావేశం.. ఈ వీడియోను కోటి మందికి పైగా ఎందుకు వీక్షించారంటే..

Updated Date - Aug 21 , 2025 | 08:04 PM