Turtles Meeting: తాబేళ్ల రౌండ్ టేబుల్ సమావేశం.. ఈ వీడియోను కోటి మందికి పైగా ఎందుకు వీక్షించారంటే..
ABN , Publish Date - Aug 21 , 2025 | 07:27 PM
ప్రకృతిలో చూడదగ్గ విశేషాలు చాలా ఉన్నాయి. అయితే మనిషి తన స్వార్థం కోసం వాటిని నాశనం చేస్తున్నాడు. కాగా, నీటిలో నివసించే జంతువులకు సంబంధించిన విశేషాల గురించి చాలా మందికి తెలియదు.
ప్రకృతి (Nature) ఎన్నో వింతలకు, విడ్డూరాలకు నెలవు. ప్రకృతిలో చూడదగ్గ విశేషాలు చాలా ఉన్నాయి. అయితే మనిషి తన స్వార్థం కోసం వాటిని నాశనం చేస్తున్నాడు. కాగా, నీటిలో నివసించే జంతువులకు సంబంధించిన విశేషాల గురించి చాలా మందికి తెలియదు. తాజాగా కొన్ని తాబేళ్లు (Turtles) సరస్సు అడుగున చేసిన పని చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ వ్యక్తి కెమెరాతో దానిని బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Turtles Meeting).
@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ సరస్సు అడుగున కొన్ని తాబేళ్లు వృత్తాకారంలో నిలబడి ఉన్నాయి. వాటి మధ్యలో రెండు తాబేళ్లు ఉన్నాయి. ఈ వీడియో చూడటానికి చాలా అందంగా ఉంది. మనుషుల మాదిరిగానే తాబేళ్లు కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.1 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. చాలా ముఖ్యమైన సమావేశం జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఒకరు పేర్కొన్నారు. ఇది తాబేళ్ల సమూహ సంభోగం ప్రక్రియ అని మరొకరు కామెంట్ చేశారు. అది తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జాగ్రత్త.. కరెన్సీ నోట్లు లెక్కపెట్టేటప్పుడు చూసుకోండి.. ఇలా కూడా మోసం జరగొచ్చు..
వార్నీ.. దోసకాయ తొక్కలకు కూడా ఇంత డిమాండ్ ఉందా.. ఓ వ్యక్తి ఎలా అమ్ముతున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..