Cucumber Peels: వార్నీ.. దోసకాయ తొక్కలకు కూడా ఇంత డిమాండ్ ఉందా.. ఓ వ్యక్తి ఎలా అమ్ముతున్నాడో చూడండి..
ABN , Publish Date - Aug 21 , 2025 | 07:09 PM
వేసవి కాలంలో చాలా మంది దోసకాయలను తింటారు. దోసకాయ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దోసకాయలతో రకరకాల వంటలు చేసుకుంటారు. దోసకాయలను తినే ముందు వాటిపై ఉండే తొక్కలను తీసేసి పారేస్తారు. ఆ తొక్కల వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని అనుకుంటారు.
వేసవి కాలంలో చాలా మంది దోసకాయలను (Cucumber) తింటారు. దోసకాయ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దోసకాయలతో రకరకాల వంటలు చేసుకుంటారు. దోసకాయలను తినే ముందు వాటిపై ఉండే తొక్కలను తీసేసి పారేస్తారు. ఆ తొక్కల వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని అనుకుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఓ బండి మీద దోసకాయల తొక్కలను (Cucumber Peels) వేసుకుని అమ్మేస్తున్నాడు. ఆ బండి ముందు నిల్చుని పలువురు ఆ తొక్కలను కొనుక్కుని తింటున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video), ఒక వ్యక్తి దోసకాయ తొక్కలను అమ్ముతున్నట్లు కనిపిస్తోంది. మనం చెత్తగా భావించి పారేసే తొక్కలను అమ్ముకుంటున్నాడు. ఒక పేపర్‌లో దోసకాయ తొక్కలను వేసి పది రూపాయలకు అమ్ముతున్నాడు. ఆ తొక్కలపై కాస్తంత ఉప్పు, మసాలా వేసి అమ్ముతున్నాడు. చాలా మంది ఆ దోసకాయ తొక్కలను తింటున్నారని చెబుతున్నాడు. దోసకాయ తొక్కలు ఆరోగ్యానికి మంచిచేస్తాయని పలువురు భావిస్తారు. కోల్‌కతాలో ఇలా దోసకాయ తొక్కలను అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
అలా దోసకాయ తొక్కలను అమ్మడం గురించి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను దాదాపు 47 లక్షల మంది వీక్షించారు. 27 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. మూగ జంతువులకు కూడా కొన్ని తొక్కలను వదిలేయండని ఒకరు కామెంట్ చేశారు. ఈ తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి అని మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
జాగ్రత్త.. కరెన్సీ నోట్లు లెక్కపెట్టేటప్పుడు చూసుకోండి.. ఇలా కూడా మోసం జరగొచ్చు..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..