Shocking Scam: జాగ్రత్త.. కరెన్సీ నోట్లు లెక్కపెట్టేటప్పుడు చూసుకోండి.. ఇలా కూడా మోసం జరగొచ్చు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:24 PM
ఎంత డిజిటల్ యుగం అయినా చాలా మంది ఇప్పటికీ కరెన్సీ నోట్లతో లావాదేవీలు సాగిస్తున్నాయి. బ్యాంక్ నుంచి లేదా ఇతరుల నుంచి డబ్బుల కట్టలను తీసుకుంటుంటారు. అయితే అలా డబ్బుల కట్టలను లెక్క పెట్టే సమయంలో చాలా జగ్రత్తగా ఉండాలి.
ఎంత డిజిటల్ యుగం అయినా చాలా మంది ఇప్పటికీ కరెన్సీ నోట్ల (Currency Notes)తో లావాదేవీలు సాగిస్తున్నారు. బ్యాంక్ నుంచి లేదా ఇతరుల నుంచి డబ్బుల కట్టలను తీసుకుంటుంటారు. అయితే అలా డబ్బుల కట్టలను లెక్క పెట్టే సమయంలో చాలా జగ్రత్తగా ఉండాలి. కరెన్సీ కట్టల (Bundle of currency notes) విషయంలో ఎలా మోసం చేస్తున్నారో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇలా కూడా మోసం చేస్తారా అని ఆశ్చర్యపోక తప్పదు (Scam).
@PalsSkit అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి 500 రూపాయల నోట్ల కట్టను చూపిస్తున్నాడు. ఆ నోట్ల కట్టను చూస్తే అంతా మామూలుగానే ఉంది. అయితే ఆ నోట్ల కట్ట మధ్యలో రెండు రూ.500 నోట్లను మధ్యకు మడిచి పెట్టారు. అలా మడిచి పెట్టడం వల్ల ఆ రెండు నోట్లు నాలుగు నోట్లలా కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల ఒక నోట్ల కట్ట నుంచి రూ.1000 తగ్గిపోతాయి. ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైందట. దీంతో ఆ వ్యక్తి వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వందల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. స్కామ్ చేసే వాళ్లకు ఇలాంటి అద్భుతమైన తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి ఐడియాలు తనకెందుకు రావడం లేదని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
షాకింగ్ వీడియో.. కాలి కింద రోడ్డు ఎలా మాయమైందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..