Shreyas Iyer: శ్రేయస్, జైస్వాల్ పాకిస్థాన్‌లో ఉండుంటే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 08:00 PM
వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరగబోయే ఆసియా కప్-2025 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టు సభ్యులను ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరగబోయే ఆసియా కప్-2025 (Asia Cup-2025) కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టు సభ్యులను ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఆ జట్టులో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వంటి ప్రతిభావంతులకు స్థానం లభించకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరిని ఎంపిక చేయకపోవడంపై మన దేశంలోనే కాదు.. పాకిస్థాన్ (Pakistan)లో కూడా చర్చ జరుగుతోంది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ నిర్వహిస్తున్న గేమ్ టైమ్ అనే టాక్ షోకు మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ తాజాగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆసియా కప్-2025 జట్టుపై అలీ విమర్శలు కురిపించాడు. 'శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు పాకిస్థాన్‌లో ఉండుంటే వారికి ఏ కేటగిరీ సెంట్రల్ కాంట్రాక్టులు లభించి ఉండేవి. వీరిని ఎంపికచేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌ను విస్మరించడం చాలా అన్యాయం' అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు.
శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్-2025 జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ స్పందించాడు. 'శ్రేయస్‌ను ఎంపిక చేయకపోవడంలో అతడి తప్పు లేదు. అలాగని మా తప్పు కూడా లేదు. మేం ప్రస్తుతానికి 15 మందిని మాత్రమే ఎంపిక చేయగలం. తన అవకాశం కోసం శ్రేయస్ మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే' అని అగార్కర్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి