Simhachalam: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆభరణాల తనిఖీ..
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:44 PM
సింహాచలం స్వామి వారి ఆభరణాల తనిఖీకి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె.సుబ్బారావు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దేవదాయశాఖ జ్యువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లం రాజు ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో రికార్డులను పరిశీలించారు.
విశాఖ: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆభరణాలను ఫైవ్‌మాన్ కమిటీ సభ్యులు తనిఖీలు చేస్తున్నారు. గత ఏడాది కడప ప్రాంతానికి చెందిన ప్రభాకరాచారి అప్పన్న భక్తులు సమర్పించిన రజిత, స్వర్ణ ఆభరణాల తూనికల్లో తేడాలున్నాయని, కొన్ని ఆభరణాలు మాయమయ్యాయని, వాటి నిజాలు నిగ్గు తేల్చాలని దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్పటి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె.సుబ్బారావు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దేవదాయశాఖ జ్యువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లం రాజు ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో రికార్డులను పరిశీలించా రు. ఆలయం, పద్మనిధి, ట్రెజరీలో ఆభరణాలను తూనికలు వేసి రికార్డులను సిద్ధం చేశారు. కానీ ఆభరణ ప్రదర్శనశాలలోని వస్తువులు తనిఖీ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రక్రియను పూర్తిచేయాలని విజయనగరం మాన్సాస్, అరసవల్లి దేవస్థానం ఈఓ ప్రసాద్ చైర్మన్‌గా ఫైవ్‌మాన్ కమిటీని నియమించారు. ఈ మేరకు ఫైవ్‌మాన్ కమిటీ ఇవాళ(శనివారం) ఆభరణాలు తనిఖీలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి