APL Season 4: ఏపీఎల్ సీజన్ 4కి విశాఖ ఆతిథ్యం..నేడు ఘనంగా ఆరంభం
ABN , Publish Date - Aug 08 , 2025 | 10:12 AM
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడా వేడుకలు క్రీడాభిమానులను అలరించనున్నాయి.
విశాఖపట్నం ఈ రోజు సాయంత్రం క్రీడా సందడితో మార్మోగనుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 సిద్ధమైంది (APL Season 4 Visakhapatnam). సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ క్రీడా మహోత్సవం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఘనంగా జరగబోతుంది. యువ క్రికెటర్లకు వేదికగా, ప్రతిభకు నిలయంగా నిలిచిన APL ఈసారి మరింత రసవత్తరంగా ఉత్సాహభరితంగా సాగనుంది.
ఈ సీజన్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. మొత్తం 25 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో 21 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లే-ఆఫ్‌లు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
తొలి మ్యాచ్‌లో
హీరో వెంకటేష్ ఈ సీజన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ప్రత్యేక లైవ్ ప్రదర్శనలతో ఈ వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో విజయవాడ సన్ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, భీమవరం బుల్స్ వంటి జట్లు కూడా బరిలో ఉన్నాయి.
విజేత జట్టుకు
ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రేక్షకులకు ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పించారు. స్టేడియం గేట్ నెంబర్ 15 నుంచి ప్రవేశం ఉంటుంది. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. విజేత జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.20 లక్షలు బహుమతిగా అందనున్నాయి. ఈ సీజన్ క్రీడాభిమానులకు ఉత్కంఠభరిత క్షణాలను అందించనుంది. విశాఖ వేదికగా జరిగే ఈ క్రికెట్ సంబరంలో మీరు కూడా పాల్గొని, ఆయా జట్లను ప్రోత్సహించండి మరి.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి