Home » Viral Video
శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ నాయకుడు తన పుట్టిన రోజు వేడుకలను మురికి కాలువలో జరుపుకొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
80 ఏళ్ల ఓ వృద్ధ కళాకారుడి కష్టాలు చూసి ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. ఆ కళాకారుడికి ఆర్థిక సాయం చేయడానికి పూనుకున్నారు.
ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు.
ముంబై మేయర్ రీతూ తావ్డే ఫుట్‌పాత్‌పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు. రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.
ముంబై మెట్రో స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి పాము కలకలం సృష్టించింది. మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లో తిరుగుతున్న దాన్ని చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది మెట్రో స్టేషన్‌కు చేరుకుని పామును పట్టుకుని వెళ్లిపోయారు.
వీధి, పిచ్చి కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మనుషులపై అవి దాడి చేసి ప్రాణాలు తీశాయి. తాజాగా ఓ శునకం దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రకృతి అందాల నడుమ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టోర్సా నది పక్కన పలువురు అటవీశాఖ అధికారులు చాపలు పరుచుకుని యోగా సాధన చేశారు. అయితే, ఈ యోగా కార్యక్రమంలో ఏనుగులు కూడా పాల్గొన్నాయి.
ఇద్దరు ఎన్జీవో కార్యకర్తలను కిడ్నాపర్లుగా భావించి దాడి చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రాంతానికి వెళ్లాల్సిన బాధితులు పొరపాటున మరో గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారులతో ఆపాయ్యంగా మాట్లాడి వారికి బిస్కెట్లు ఇవ్వడంతో కిడ్నాపర్లనే పుకారు షికారు చేసింది.
ఓ యువకుడు, పోలీస్ అధికారికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో వివాదం చెలరేగింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారని యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు.