Share News

బాతును అమాంతం మింగేసిన కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 03 , 2026 | 08:34 PM

ఓ కొండచిలువ బాతుపై దాడి చేసి చంపేసింది. తర్వాత దాన్ని పూర్తిగా మింగేసింది. అయితే, కొద్దిసేపటి తర్వాత అది బాతును బయటకు ఊసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాతును అమాంతం మింగేసిన కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే..
Navi Mumbai python

ఇంటర్‌నెట్ డెస్క్: కొండచిలువలు సాధారణంగా ఏదైనా జీవిపై దాడి చేస్తే.. వాటిని చంపి తల వైపు నుంచి మింగేస్తాయి. తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయే వరకు వేరే జీవిపై దాడి చేయవు. కానీ, చాలా అరుదుగా మింగిన జీవిని కొండచిలువలు బయటకు ఊసేస్తుంటాయి. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ కొండచిలువ బాతుపై దాడి చేసి చంపేసింది. తర్వాత దాన్ని పూర్తిగా మింగేసింది. అయితే, కొద్దిసేపటి తర్వాత అది బాతును బయటకు ఊసేసింది. ఆ వివరాల్లోకి వెళితే..


గురువారం నవీ ముంబైలోని నివాస ప్రాంతంలోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. బావి దగ్గర తిరుగుతున్న బాతుపై దాడి చేసింది. బాతును చంపేసిన తర్వాత మెల్లగా దాన్ని మింగేసింది. ఇక, సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బందిని చూడగానే అది ఆశ్చర్యకరమైన పని చేసింది. బాతును బయటకు ఊసేసింది. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు, శరీరాన్ని తేలికగా మార్చుకుని అక్కడి నుంచి వేగంగా పారిపోవడం కోసం కొండచిలువలు మింగిన ఆహారాన్ని బయటకు వాంతి చేసుకుంటుంటాయని స్నేక్ రెస్క్యూ సిబ్బంది చెప్పారు.


పామును బంధించి అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ కొండచిలువకు అది నచ్చినట్లు లేదు. అందుకే వాంతి చేసుకుంది’..‘కొండచిలువకు ఫుడ్ అలర్జీ వచ్చినట్లు ఉంది’..‘నువ్వసలు కొండచిలువవేనా’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ సర్కార్ రికార్డు

తానా ఛార్లెట్ నాయకుల దాతృత్వం

Updated Date - Jul 03 , 2026 | 08:50 PM