రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ సర్కార్ రికార్డు
ABN , Publish Date - Jul 03 , 2026 | 08:27 PM
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలను వేగవంతం చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: రైతు భరోసా పథకం అమలులో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. కేవలం నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.6,590.37 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసి రికార్డు సృష్టించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నేడు నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు రూ.1,188 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన అర్హులైన రైతులకు కూడా దశలవారీగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
Also Read:
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు