Share News

ట్రైన్‌లో యువతికి దారుణ అనుభవం.. వృద్ధుల అసభ్య ప్రవర్తన..

ABN , Publish Date - Jul 05 , 2026 | 07:58 AM

రైలు ప్రయాణంలో ఓ యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఇద్దరు వృద్ధులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. చెయ్యితో ఆమెను పదే పదే తాకుతూ నీచానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బిహార్‌లో శనివారం చోటుచేసుకుంది.

ట్రైన్‌లో యువతికి దారుణ అనుభవం.. వృద్ధుల అసభ్య ప్రవర్తన..
Bihar train harassment

ఇంటర్‌నెట్ డెస్క్: రైలు ప్రయాణంలో ఓ యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఇద్దరు వృద్ధులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. చెయ్యితో ఆమెను పదే పదే తాకుతూ నీచానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బిహార్‌లో శనివారం చోటుచేసుకుంది. యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఘటనపై ఓ పోస్టు పెట్టింది.


ఆ పోస్టులో ఏముందంటే.. ‘రైలులో నేను ఎంతటి అసౌకర్యాన్ని, ఇబ్బందిని ఎదుర్కొన్నానో ఒక్కసారి ఊహించండి. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. నేను సీవాన్ నుంచి పాట్లీపుత్ర బయలుదేరాను. ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్నాను. నేను పై బెర్త్‌ (upper berth) పైకి వెళ్లి నిద్రపోయాను. ఛప్రా స్టేషన్ దగ్గర కొందరు వృద్ధులు నా కింద ఉన్న సీట్లో కూర్చున్నారు. నేను నిద్రలో ఉన్నప్పుడు, వారిలో ఒక వృద్ధుడు వెనుక నుంచి తన చేతిని పైకి చాపి నన్ను పదే పదే తాకడం ప్రారంభించాడు’..


‘నేను చాలా మర్యాదగా.. 'అంకుల్, దయచేసి మీ చెయ్యి కిందకు పెట్టండి' అని చెప్పాను. కానీ, అతను నా మాటలను పట్టించుకోలేదు. దానికి బదులుగా, అతను ముందు వైపు నుంచి నన్ను తాకడానికి ప్రయత్నించాడు. ఇది నాకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించింది. కాసేపటి తర్వాత అతను ఆపేశాడు. కొద్దిసేపటి తర్వాత అతను మళ్లీ నన్ను తాకడం మొదలుపెట్టాడు. నేను వెంటనే లేచి కూర్చుని.. ఆ బెర్త్‌పై ఎంత దూరం జరగగలనో అంత దూరం జరిగాను. మరొక వృద్ధుడు కూడా చెయ్యి పైకి చాపి నన్ను తాకాడు. నేను వెంటనే ఆ కోచ్‌ని వదిలేసి పక్కనే ఉన్న జనరల్ కోచ్‌లోకి వెళ్లాను, కానీ, అది పూర్తిగా రద్దీగా ఉంది. దాంతో నేను ఏసీ కోచ్ బయట ఉన్న సీటుపై కూర్చున్నాను‘..


‘అక్కడ ఓ యువకుడు నా దగ్గరకు వచ్చాడు. కొద్దిపాటి డబ్బులు ఇస్తే పరీక్ష పాస్ చేయిస్తానని, నా ఫోన్ నంబర్ ఇవ్వాలని పదే పదే అడిగాడు. నేను చాలాసార్లు నిరాకరించాను. నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పాను. అయినా.. అతను నన్ను వదల్లేదు. 'నన్ను మీ సోదరుడిగా భావించండి. నా నంబర్ సేవ్ చేసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది' అని అన్నాడు. నేను అప్పటికీ నిరాకరించాను. అదృష్టవశాత్తూ అతను దిఘ్వారా స్టేషన్‌లో దిగిపోయాడు. నా ప్రశ్న ఏమిటంటే.. రైళ్లలో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలకు అసలు రక్షణ ఉందా?.. ఈ రోజుల్లో మగాళ్లు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ యువతి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Jul 05 , 2026 | 01:15 PM