Share News

బ్యూటీపార్లర్ యజమాని పాడు పని.. చెప్పుతో చావగొట్టిన మహిళా వర్కర్లు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 03:58 PM

తాగే నీళ్లలో మత్తు మందు కలుపుతున్నాడన్న అనుమానంతో బ్యూటీ పార్లర్ యజమానిపై మహిళా వర్కర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చెప్పులతో సమాధానం చెప్పారు. 43 సార్లు యజమానిని చెప్పుతో చావగొట్టారు.

బ్యూటీపార్లర్ యజమాని పాడు పని.. చెప్పుతో చావగొట్టిన మహిళా వర్కర్లు..
Churu viral video

ఇంటర్‌నెట్ డెస్క్: తాగే నీళ్లలో మత్తు మందు కలుపుతున్నాడన్న అనుమానంతో బ్యూటీ పార్లర్ యజమానిపై మహిళా వర్కర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చెప్పులతో సమాధానం చెప్పారు. 43 సార్లు యజమానిని చెప్పుతో చావగొట్టారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. చురు జిల్లాలోని సాదుల్‌పూర్‌కు చెందిన భవానీ శంకర్ ఖత్రీ అనే వ్యక్తి స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. పార్లర్ నిర్వహణ మొత్తం అందులో పని చేసే మహిళలే చూసుకునేవారు. భవానీ అప్పుడప్పుడు షాప్ దగ్గరకు వచ్చి పోతుండేవాడు.


జూన్ 27వ తేదీన అతడు షాప్ దగ్గరకు వచ్చాడు. మహిళా వర్కర్లు తాగే నీటిలో రహస్యంగా ఏదో కలిపాడు. యజమాని నీళ్లలో ఏదో కలిపాడని వర్కర్లకు అనుమానం వచ్చింది. అయితే, సరైన ఆధారాలు లేకపోవటంతో అతడిని ఏమీ అనలేదు. జూన్ 29వ తేదీన అతడు వస్తున్నాడని తెలిసి సెల్‌ఫోన్‌లో సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేయటం మొదలెట్టారు. ఈ విషయం తెలియని భవానీ తన వెంట తెచ్చుకున్న దాన్ని నీళ్లలో కలిపాడు. ఆ దృశ్యాలు సెల్‌ఫోన్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను చూసి మహిళా వర్కర్లు ఆగ్రహానికి గురయ్యారు.


తాగే నీటిలో మత్తు మందు కలుపుతున్నాడని ఆరోపిస్తూ యజమానిపై దాడికి దిగారు. చెప్పులతో ఏకంగా 43 సార్లు కొట్టారు. అనంతరం భవానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు భవానీని అదుపులోకి తీసుకుని విచారించగా.. ‘బ్యూటీ పార్లర్ సరిగా నడవటం లేదు. అందుకే పసుపు ఆవాలు పార్లర్‌లో ఉంచాను. గంగా జలాన్ని తాగే నీళ్లలో కలిపాను’ అని అన్నాడు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

Updated Date - Jul 04 , 2026 | 04:16 PM