Home » Viral Video
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. తొండంతో నేలకేసి కొట్టి చంపేసింది. ఏనుగుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించగా ఈ విషాదం చోటుచేసుకుంది.
కేంద్ర మాజీ మంత్రి ఎంకే అలగిరి కుమార్తె కయల్విజి వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్‌పై దాడి చేశారనే ఆరోపణలతో ఆమెపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.
రన్నింగ్ బస్సులో ఓ యువకుడు ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించాడు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురైంది. తోటి ప్రయాణికులు, బస్ డ్రైవర్ సాయంతో అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పింది.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ వర్ష గైక్వాడ్ షేర్ చేసిన వీడియోపై ముంబై పోలీస్ శాఖ స్పందించింది. నీట్ పేపర్ లీక్ అంశంపై ముంబైలోని దాదర్‌లో చేపట్టిన నిరసనల సందర్భంగా ఓ పోలీస్ అధికారి యువతితో తప్పుగా ప్రవర్తించాడంటూ ఆమె పెట్టిన ఆ పోస్టును పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది.
హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరీ అనే వ్యక్తి గంటలో 847 పుష్‌అప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. అది కూడా నడుపై 27.21 కిలోల బరువును ఉంచుకుని 847 పుష్‌అప్స్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో ఓ అంబులెన్స్ సిబ్బందిలోని వ్యక్తి చూపిన ధైర్యసాహసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ చిరు వ్యాపారి వినూత్నంగా టీ తయారు చేసిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశంలో చట్టాలు అందరికీ సమానమే. వాటికి ఎవరూ అతీతులు కాదు. చివరికి ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా క్షేమంగా గమ్యస్థానం చేరుకోవచ్చని వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తారు.
రాజస్థాన్‌లోని తోంక్ జిల్లాలో చిరుతపులి అలజడి సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ప్రవేశించిన ఆ చిరుతపులి జనాలపై విరుచుకుపడింది. ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది.