Share News

నడిరోడ్డుపై కత్తితో యువకుడి హల్‌చల్.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:40 PM

ఓ యువకుడు అర్ధనగ్నంగా.. చేతిలో కత్తితో నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న పలువురు పాదచారులపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చైనాలో సోమవారం చోటుచేసుకుంది.

నడిరోడ్డుపై కత్తితో యువకుడి హల్‌చల్.. వైరల్‌గా మారిన వీడియో..
Hong Kong knife attack

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ యువకుడు అర్ధనగ్నంగా.. చేతిలో కత్తితో నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న పలువురు పాదచారులపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చైనాలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హాంగ్ కాంగ్‌, పోక్ ఫు లామ్‌లోని బగ్యువో విల్లాలో 22 ఏళ్ల ఓ యువకుడు సోమవారం ఉదయం అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి చేతిలో ఓ పొడవాటి కత్తి ఉంది. ఆ యువకుడు రోడ్డుపై వెళుతున్న పాదచారులను వెంబడించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.


సెక్యూరిటీ గార్డ్స్, కొంతమంది జనం అతి కష్టం మీద అతడిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని అరెస్ట్ చేసి, అక్కడినుంచి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగానే అతడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా..

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

Updated Date - Aug 12 , 2026 | 01:48 PM