Share News

జేసీబీ‌తో డ్రైవర్ పరార్.. సినిమా లెవెల్లో పోలీస్ ఛేజింగ్..

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:58 PM

ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్‌ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి.

జేసీబీ‌తో డ్రైవర్ పరార్.. సినిమా లెవెల్లో పోలీస్ ఛేజింగ్..
Odisha JCB driver

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్‌ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఛేజింగ్ ఆపకపోవటంతో డ్రైవర్ జేసీబీని రోడ్డుపై వదిలి పారిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని ఖల్లికోటె పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.


ఆగస్టు 15వ తేదీన యజమానితో అతడికి గొడవైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి జేసీబీతో అక్కడినుంచి పరారయ్యాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖల్లికోటె, రంభ, పురుషోత్తమ్‌పూర్, కబిసూర్యనగర్ ఏరియా పోలీసులు రంగంలోకి దిగారు. జేసీబీతో పరారవుతున్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పురుషోత్తమ్‌పూర్‌లోని రోడ్డుకు అడ్డంగా బారికేడ్స్ పెట్టారు. డ్రైవర్ జేసీబీని ఆపకుండా ఆ బారికేడ్స్‌ను బద్ధలు కొట్టుకుని పోయాడు.


దీంతో సినిమా సీన్‌ను తలపించే ఛేజింగ్ మొదలైంది. గుడియాల్ దగ్గర జేసీబీ డ్రైవర్ ఛేజింగ్‌కు ముగింపు పలికాడు. జేసీబీని రోడ్డుపై వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

Updated Date - Aug 18 , 2026 | 08:10 PM