Share News

శ్మశానం రెస్టారెంట్.. సమాధుల మధ్యే టిఫిన్లు, భోజనాలు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:58 PM

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ విచిత్రమైన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో కస్టమర్లు సమాధుల మధ్య కూర్చుని ఆహారం తింటారు, పానీయాలు తాగుతారు. అహ్మదాబాద్‌లో ప్రాచూర్యం పొందిన ఆ రెస్టారెంట్‌కు జనం ‘శ్మశానం రెస్టారెంట్’ అని పేరు పెట్టారు.

శ్మశానం రెస్టారెంట్.. సమాధుల మధ్యే టిఫిన్లు, భోజనాలు..
Ahmedabad Kabristan Restaurant

ఇంటర్‌నెట్ డెస్క్: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ విచిత్రమైన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో కస్టమర్లు సమాధుల మధ్య కూర్చుని ఆహారం తింటారు, పానీయాలు తాగుతారు. అహ్మదాబాద్‌లో ప్రాచూర్యం పొందిన ఆ రెస్టారెంట్‌కు జనం ‘శ్మశానం రెస్టారెంట్’ అని పేరు పెట్టారు. ఆ శ్మశానం రెస్టారెంట్‌లో దాదాపు 26 సమాధులు ఉన్నాయి. సమాధుల మధ్య ఉన్న టేబుళ్లలో కూర్చుని కస్టమర్లు ఆర్డర్ చేసుకున్న ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటున్నారు. శ్మశానం అన్న భయం వారిలో కొంచెం కూడా లేదు.


ఆ శ్మశానం రెస్టారెంట్‌లో ఆహారం తినటం వల్ల అదృష్టం వరిస్తుందని కొంతమంది కస్టమర్లు నమ్ముతున్నారు. వీ జెనిల్ అనే యువకుడు శ్మశానం రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘ఇలా చేయటం చాలా ప్రమాదకరం. శ్మశానం దగ్గర ఆహారం అస్సలు తినకూడదు’..‘అది నిజమైన శ్మశానం కాదు.. అంతా ఫేక్’.. ‘ఇలా శ్మశానంలో ఆహారం తినటం చాలా మూర్ఖమైన పని’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కూరగాయలు ఎంత తాజాగా కనిపించినా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

Updated Date - Aug 18 , 2026 | 06:14 PM