చాక్లెట్ లాక్కుందని తల్లిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 16 , 2026 | 08:14 AM
అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వకపోతే చాలు.. చిన్నపిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే తన తల్లి చాక్లెట్ లాక్కుందని ఓ బాలుడు అలిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వకపోతే.. చిన్నపిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే తన తల్లి చాక్లెట్ లాక్కుందని ఓ బాలుడు అలిగాడు. అంతటితో ఆగకుండా ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ అమాయక బాలుడి ముద్దు ముద్దు మాటలకు అక్కడి వారంతా నవ్వారు. ఈ ఘటన మధప్రదేశ్ బుర్హాన్‌పూర్‌లోని దేధ్‌తలై పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.
చెప్పిన మాట వినడం లేదని.. ఆ బాలుడిని తల్లి మందలించింది. అతడి వద్ద ఉన్న చాక్లెట్ తీసుకుంది. దీంతో తల్లిపై కోపం తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పి.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరాడు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలంటూ మారాం చేశాడు. దీంతో ఆ బాలుణ్ని తన తండ్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఎస్ఐ ప్రియాంక నాయక్ ఏమైందని ఆ చిన్నారి ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని ఆమెకు పూసగుచ్చినట్టు చెబుతూ.. 'అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తోంది. నన్ను కొడుతోంది. ఆమెను జైలులో పెట్టండి' అని అన్నాడు.
ఈ నేపథ్యంలో తెల్ల కాగితంపై ఎస్ఐ ఫిర్యాదు రాసింది. ఆ కాగితం కింద సంతకం చేయాలని ఆ బాలుణ్ని కోరింది. అక్షరాలు రాయడం కూడా రానీ ఆ బుడ్డోడు ఓ చిన్న గీత గీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. అయితే 2022 నాటి ఈ వీడియో.. నేటికీ వైరల్ అవుతుండడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే..
భార్య కోరిక తీర్చేందుకు ఇల్లు అమ్మేశాడు.. 200 ఎకరాలను పూల తోటగా మార్చాడు..
For More Viral News And Telugu News